ధరణిలో భూమి విలువ ఆప్షన్

by Shyam |
Dharani web portal
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌లో మరో రెండు కొత్త ఆప్షన్లు చేరాయి. మీ భూమి మార్కెట్​విలువ ఎంత ఉన్నదో ఈజీగా తెలుసుకోవచ్చు. దాని కోసం మార్కెట్​వ్యాల్యూ ఆప్షన్​ను ఇచ్చారు. అందులో జిల్లా, మండలం, ఊరు, సర్వే నంబర్లు, సబ్​డివిజన్ల వారీగా విలువలు నమోదు చేశారు. ఎవరైనా లాగిన్​కావచ్చు. అలాగే సేల్​డీడ్​కోసం స్టాంపు డ్యూటీని కూడా లెక్కించేందుకు ఆప్షన్ ఇచ్చారు. దాంతో పాటు బ్యాంకర్ల కోసం పోర్టల్‌ను ఏర్పాటు చేశారు.

పోర్టల్‌లో ఇప్పటికే వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, క్రయ విక్రయాల కోసం 29 మాడ్యూల్స్​ను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే చాలా వాటికి మార్గదర్శకాలు లేకపోవడంతో దరఖాస్తులు పెండింగులో ఉంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. విద్యావంతులు దరఖాస్తు చేసుకోవడానికి అనుకూలంగా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దారు. సామాన్య రైతులంతా ఇతరుల సాయాన్ని పొందాలి. లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు సమర్పించుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed