- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘భూదాన్’ పేరిట భూముల మాయ..?
ప్రపంచ దేశాలు తిరస్కరించిన ఫార్మా కంపెనీలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి ఆహ్వానిస్తుండటం పేద రైతుల పాలిట శాపంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు మండల పరిధిలో 19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇందుకు భూసేకరణలో భాగంగా యాచారం మండల పరిధిలోని 150 మంది పేదరైతుల భూములను ‘భూదాన్ బోర్డు’ పేరుతో అప్పనంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రైతులకు నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో తాతల కాలం నుంచి ఈ భూములు సాగుచేసుకుంటూ జీవిస్తున్న రైతుల్లో ఆందోళన మొదలైంది.
ఈ భూములన్నీ మా తాతలు, తండ్రులు కాయ కష్టం చేసి సంపాదించినవని సదరు రైతులు మొత్తుకుంటున్నా.. అధికారులు మాత్రం భూదాన్ బోర్డు కిందకే వస్తాయంటున్నారు. తమ దగ్గర ఈ భూములకు సంబంధించిన పాత పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళనలో భాగంగా కొంతమందికి మాత్రమే కొత్త పుస్తకాలు ఇచ్చారని రైతులు చెబుతున్నారు. సర్వే నం. 155, 156లోని భూములకు సంబంధించి కొంతమంది బడా నాయకుల పేర పట్టా పాస్‌పుస్తకాలు జారీఅయ్యాయని, కానీ కావాలనే పేద రైతుల పాస్ పుస్తకాలను పెండింగ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎకరం భూమి రూ. 50 లక్షలు పలుకుతుండటంతోనే ప్రభుత్వం ఈ భూములపై కన్నేసి, మా పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ పరిహారం..ఎక్కువ లబ్ది
భూసేకరణ ముసుగులో విలువైన భూములను మార్కెట్ ధర కంటే తక్కువకు పేద రైతుల నుంచి లాక్కునేందుకు ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. తర్వాత ఇవే భూములను విదేశీ కంపెనీలకు రెండు మూడు రెట్ల అధిక మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కూలీ నాలీ చేసి.. కడుపు కట్టుకుని, పైసా పైసా కూడబెట్టి సంపాదించుకున్న భూములను ‘భూదాన్’ పేరిట లాక్కుంటే.. ఆ భూముల మీదే ఆధారపడిన మేమంతా ఎట్లా బతికేదంటూ యాచారం మండలం, మేడిపల్లి గ్రామ మహిళా రైతు సంగెం ప్రమీల ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త ఏడేండ్ల కిందటే విద్యుత్ షాక్‌తో చనిపోతే.. ఉన్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన నలుగురు పిల్లలను పోషించుకుంటోంది. ఎకరాకు రూ. 50 లక్షలు ధర పలుకుతున్న భూములను ‘భూదాన్’ పేరిట లాక్కొని ఫార్మా కంపెనీకి అప్పగిస్తే.. మా పరిస్థితి ఏమిటని, మా పిల్లల పెండ్లిళ్లు ఎలా చేయాలని బాధితురాలు వాపోవడం కలచివేస్తోంది.