- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాల్‌దర్వాజా బోనాలు ప్రారంభం..
దిశ, చార్మినార్ : తెలంగాణలో ప్రసిద్దిచెందిన లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు శాస్త్రోక్తంగా, వేదమంత్రోచ్చారణలతో, మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో చారిత్రాత్మక నేపధ్యం కలిగిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళిదేవాలయం, బంగారు మైసమ్మదేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళిదేవాలయం, సుల్తాన్షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేళా ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా కోటమైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ కనకదుర్గ ఆలయం, దేవి దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, మేకల్బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయాలలో శిఖరపూజ, ధ్వజా రోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు.
ఉత్సవాలను ప్రారంభించిన సీపీ అంజనీకుమార్ ..
ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా లాల్‌దర్వాజా శ్రీసింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ 113 వ బోనాల వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శిఖరపూజ, ధ్వజా రోహణంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటి తరపున మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్ కుటుంబం తొలి బోనం సమర్పించింది. లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ కె.వెంకటేష్ కుటుంబసమేతంగా కలశ స్థాపన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం ఇ ఓ అన్నపూర్ణ, చార్మినార్ జోనల్ జాయింట్ సిపి డి.డి నాయక్, ఉమ్మడి కమిటీ చైర్మన్ బల్వంత్ యాదవ్, ఉపాధ్యక్షుడు కె.ఎస్ ఆనంద్, ఆలయ కమిటీ ప్రతినిధులు కాశీనాథ్, లక్ష్మీనారాయణగౌడ్, బద్రీనాథ్, రాజ్‌కుమార్, షీరా రాజ్‌కుమార్, మారుతీయాదవ్, అరవింద్‌కుమార్‌గౌడ్, చంద్రకుమార్, విఠల్, టిఆర్ ఎస్ నాయకుడు పోసాని సదానంద్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
అక్కన్న మాదన్న వేడకులను ప్రారంభించిన మేయర్
హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయాన్ని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు భగవాన్ మహరాజ్, రవినారాయణ ఆధ్వర్యంలో ధ్వజా రోహణ చేసిన మేయర్ విజయలక్ష్మి అక్కన్న మాదన్న మందిర 73వ బోనాల వార్షికోత్సవ వేడకులను లాంఛనంగా ప్రారంభించారు. ఆషాడమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రార్థనమందిరంలో సామూహిక కుంకుమార్చనలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించింది. అంతకుముందు అమ్మవారికి అభిషేకం, కలశస్థాపన పూజను చేతన్‌కుమార్ సూరి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జి.రాజరత్నం, ప్యాట్రన్ జి.నిరంజన్, కార్యదర్శి కె.దత్తాత్రేయ, కోశాధికారి ఎ.సతీష్‌కుమార్, ప్రతినిధులు ఆవుల భరత్ ప్రకాష్, రాందేవ్ అగర్వాల్, ఎం.కృష్ణ, ఎస్.పి క్రాంతికుమార్, జి.శ్రీనివాస్, ఎ.గోపాల్, జి.రాజు, మహేష్‌లు ఉన్నారు.
మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయంలో అంగరంగవైభవంగా బోనాల ఉత్సవాలు ప్రారంభం..
మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ, అఖండ జ్యోతి, శతఛండీ సంకల్పం, విఘ్నేశ్వర పూజ, పుణ్య హ వాచనం, రుత్వి గ్వర్ణనము, అంకురారోహణం, సర్వతో భద్ర మండపం, కలశ స్థాపన, ధ్వజా రోహణం, శ్రీ చక్ర అర్చన, ఛండీహోమం హారతి తదితరచ పూజా కార్యక్రమాలు జరిగాయి. బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం ఇఓ అన్నపూర్ణమ్మ, ఉమ్మడి కమిటీ ఉపాధ్యక్షుడు కె.ఎస్ ఆనంద్‌రావు, ప్రధాన కార్యదర్శి మధుసూధన్ యాదవ్, గాజుల రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
మహంకాళి 72 వ బోనాల వార్షికోత్సవాలు ప్రారంభం..
ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు జనగామ మధుసూధన్గౌడ్ ఆధ్వర్యంలో 72 వ బోనాల వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోపూజ, గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, ధ్వజా రోహణం, కలశస్థాపన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం ఇఓ అన్నపూర్ణమ్మ, ప్రముఖ హిందూ ధర్మ వ్యాఖ్యాత చండీ ఉపాసకులు కొనగండ్ల రఘుశర్మ, ప్రతినిధులు కె.ఎస్ ఆనంద్, కీర్తి నరేందర్ ముదిరాజ్, సుభాష్‌గౌడ్, బాబురావు ముదిరాజ్, సతీష్‌గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, ప్రదీప్‌గౌడ్, గుర్నాథ్ రెడ్డి, భవానీశంకర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
గౌలిపురా శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో..
గౌలిపురా శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదర్లమహేష్ ఆధ్వర్యంలో కుంభ అభిషేకం, గణపతి హోమం, నవగ్రహ పూజ, కలశస్థాపన పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు డొంకి యాదగిరి, ఇమేనియల్, కె.దేవేందర్, నరేష్కుమార్, బ్రహ్మానందం, దయానంద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.