- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్‌వీబీలో షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వాటాదార్ల సమావేశంలో ఎండీ, సీఈవో ఎస్ సుందర్ సహా ఏడుగురు డైరెక్టర్లను తొలగించిన ప్రైవేట్ రంగ బ్యాంక్ లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్‌వీబీ) గురువారం షేర్ల జారీ ద్వారా సుమారు రూ. 500 కోట్లను సమీకరించడానికి బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించింది. ఈ నిధుల సమీకరణ ఇప్పటికే ఉన్న వాటాదారుల హక్కుల ఆధారంగా, అవసరమైన సెబీ ఆమోదాలకు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది.
గురువారం జరిగిన సమావేశం అనంతరం, రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఈక్విటీ వాటాల జారీ, కేటాయింపుల ద్వారా నిధుల సేకరణకు ఆమోదం లభించింది. తద్వారా రూ. 500 కోట్ల వరకు సమీకరణ ఉంటుందని లక్ష్మీ విలాస్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. బ్యాంకు వాటాల జారీకి సంబంధించి షరతులను బోర్డు లేదంటే బోర్డు ఏర్పాటు చేయబోయే కమీటీ రానున్న రోజుల్లో నిర్ణయించనున్నట్టు బ్యాంకు వెల్లడించింది.
Advertisement
Next Story