లాక్‌డౌన్ లేకుంటే 8 లక్షల కేసులు… కాదు.. కాదు!!

by  |
లాక్‌డౌన్ లేకుంటే 8 లక్షల కేసులు… కాదు.. కాదు!!
X

న్యూఢిల్లీ : కరోనా కేసుల సంఖ్య పై కేంద్ర ప్రభుత్వంలో సమన్వయం కరువైనట్టు తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొన్న గణాంకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్న ఐసీఎంఆర్ రిపోర్ట్ అసలు లేనే లేదని తెలిపింది.

విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (వెస్ట్) వికాస్ స్వరూప్.. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో గురువారం ఢిల్లీలో మాట్లాడారు. లాక్ డౌన్ లతో ఇక్కడ వైరస్ విస్తరణ వేగానికి కళ్లెం పడింది. ఒక్క రోజుకు ఒకరి నుంచి 2.5 మందికి సోకే అవకాశం ఉండగా దాన్ని 0.625కి కుదించిందని తెలిపారు. ఒకవేళ లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికీ దేశంలో కరోనా కేసులు 8 లక్షలకు చేరేదని చెప్పారు. ఐసీఎంఆర్ రిపోర్టు ఈ మేరకు వెల్లడించిందని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. అటువంటి ఐసీఎంఆర్ రిపోర్ట్ లేదని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.

Tags: Coronavirus, external affairs, health, ICMR, report, lockdown

Advertisement

Next Story

Most Viewed