- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి పేర్ని నానిపై కూలీ దాడి
దిశ, వెబ్డెస్క్: ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం పేర్ని నానిపై తాపీమేస్త్రి దాడికి యత్నించాడు. మంత్రిని కలవడానికి అని వచ్చిన నాగేశ్వరరావు అనే వ్యక్తి.. ఆయన కాళ్లకు దండం పెడుతూ ఒక్కసారిగా తాపితో దాడికి యత్నించాడు.వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు నాగేశ్వరరావును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో పేర్ని నాని సురక్షితంగా బయటపడ్డారు. నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లు పోలీసులు నిర్దారించారు.
దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇవాళ మా అమ్మ పెద్దకర్మ కావడంతో భారీగా ప్రజలు వచ్చారు. ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడుతూ గేటు దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాళ్ల మీద పడుతున్నట్లుగా ఇనుప వస్తువుతో తనపై దాడికి ప్రయత్నించాడు. రెండు సార్లు దాడి చేసేందుకు యత్నించాడని పేర్ని నాని తెలిపారు.