- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసీఆర్‌పై కేవీపీఎస్ సంచలన ఆరోపణలు
దిశ, దామరచర్ల: దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రెమడాల పరుశురాములు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్ రాజుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పరుశురాములు మాట్లాడుతూ హరితహారం పేరుతో పోడు భూముల్లో కందకాలు తవ్వడంతో పాటు మొక్కలు నాటడం ఏమాత్రమూ సరికాదన్నారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా బ్యాక్ లాగ్పోస్టులు ఉండగా.. ఈ ఏడేండ్లలో 800 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఇన్ని ఖాళీలు ఉన్నా ఏటా రిక్రూట్‌మెంట్ ఎక్స్‌టెన్షన్ జీవో రిలీజ్ చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని దుయ్యబట్టారు. జిల్లాల్లో ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ రిక్రూట్‌మెంట్ కోసం నియమించాల్సిన కమిటీలు పత్తా లేకుండా పోయాయని అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. దాడులు ఇలానే కొనసాగితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు పరంగి సైదులు, నాయకులు తక్కెళ్లపల్లి యేసు, బొల్లెంపల్లి పాపారావు, పుట్టల శ్రీకాంత్, మహంకాళి శ్రీనివాస్, కేవీపీఎస్ మండల నాయకులు గురుమూర్తి, గజ్జి వంశీ, వెంకటేష్, దైద దేవయ్య తదితరులు పాల్గొన్నారు.