- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పల్లాకు షాకిచ్చిన కేయూ జేఏసీ
దిశ ప్రతినిధి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను కేయూ విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కేయూలోకి అడుగుపెట్టే నైతిక అర్హత పల్లాకు లేదని విద్యార్థి సంఘాల నేతలు కాన్వాయ్‌కు అడ్డంగా నిల్చున్నారు. ఈక్రమంలో టీఆర్ ఎస్వీ నేతలకు కేయూ విద్యార్థి సంఘాల జేఏసీ నేతలకు తోపులాట జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కారులోనే కూర్చిన ఉండగా, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాత్రం కిందకు దిగి విద్యార్థి సంఘాల నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే వినయ్‌భాస్కర్‌పై విద్యార్థి నాయకులు ప్రశ్నల వర్షం కురిపించారు.
పట్టభద్రుల ఓట్లతో ఎమ్మెల్సీ అయిన పల్లారాజేశ్వర్‌రెడ్డి వారికి ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఎన్నికలు వస్తేనే విద్యార్థులు గుర్తుకు వస్తారా..? అని నిలదీశారు. పల్లా గో బ్యాక్ నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారు. పోలీసులు బలవంతంగా విద్యార్థి జేఏసీ నేతలను అరెస్టు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్‌కు తరలించి యూనివర్సిటీలో ప్రచారం ముగిశాక వారిని విడుదల చేశారు. టీఆర్ ఎస్ నేతలను అడ్డుకున్న వారిలో పీడీఎస్యూ రాష్ట్ర నేత దుర్గం సారయ్య, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తిరుపతి, రంజిత్, సర్దార్ వినోద్‌కుమార్, రాజేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.