- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలా ముందుకు వెళ్దాం.. ప్రగతి భవన్ లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నికలకు అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విజయమే లక్ష్యంగా కార్యచరణ చేపడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉందనే ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నాటి నుంచి హుజూరాబాద్ లో రాజకీయం వేడెక్కింది.
టీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావుకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు అన్ని వర్గాలు, కుల సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఆయనతో పాటు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో పాటు ఎమ్మెల్యేలు సైతం విస్తృత ప్రచారం చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని ప్రారంభించడంతో పాటు పలు పథకాలను కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి స్పందన ఉంది… ఎలా ముందుకు సాగితే విజయం సాధిస్తామని అందుకు సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వివరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం చేయొద్దని పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.