ఒక్క రోజు.. 112 టీఎంసీలు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ బంపర్​ ఆఫర్​

by Shyam |
KRMB
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను కేటాయించారు. ఖరీఫ్​ కోసం ఈ నెల 15 వరకు (నేటి వరకు) రెండు రాష్ట్రాలు 112.56 టీఎంసీలను వాడుకునేందుకు అవకాశం కల్పిస్తూ కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాలకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఈనెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ, తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి.

ఈ ఏడాది జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు 207 టీఎంసీల నీటి వినియోగానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఇవ్వగా. 212.43 టీఎంసీలు వాడుకుంది. 169 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సర్కారు ప్రతిపాదనలు ఇవ్వగా కేవలం 81.85 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటికి ఆమోదం తెలిపిన బోర్డు ఈనెల 15 వరకు ఏపీ 23.68 టీఎంసీలు, తెలంగాణ 88.82 టీఎంసీలు వాడుకునేందుకు ఆమోదించింది. డిసెంబర్ 15 తర్వాత రెండు రిజర్వాయర్లలోని కనీస నీటిమట్టాలపై 145 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed