కృతి కవిత్వానికి అభిమానులు ఫిదా!

by  |
కృతి కవిత్వానికి అభిమానులు ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కవయిత్రిగా మారిపోయింది. అంతేకాదు, కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు రోజుకో అంశం మీద కవిత రాస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ మధ్య మనీషా వాల్మీకి ఘటన గురించి ఓ కవిత రాసిన కృతి.. అమ్మాయిలు, అబ్బాయిల పెంపకంలో సమానత్వం ఎందుకు ఉండాలి? ఎక్కడ ఎలాంటి మార్పులు రావాలని చెప్తూ రాసిన కవిత జనంలో ఆలోచన కలిగించగా.. తాజాగా ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే అత్యంత పవిత్రమైన ప్రేమ గురించి వివరిస్తూ కవిత రాసింది. ప్రేమను వ్యక్తపరిచేందుకు బోలెడు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక్క చూపు చాలంటూ రాసిన కవిత, దాని పక్కనే ఉన్న తన ఫొటోను చూస్తూ ఫిదా అయిపోని జనాలు ఉంటారా! చెప్పండి. ఇంతకీ కృతి రాసిన కవిత ఏంటో తెలుసా?

https://twitter.com/kritisanon/status/1313753366363664385?s=19

‘ఆ క్షణం
ఆ చూపు
మీరు అతనిని చూసినప్పుడు
మీ ప్రేమ ప్రతిబింబం చూడండి
అతని కళ్ళలోకి చూడండి
ఒక్క మాట కూడా మాట్లాడలేదు
కానీ అది ఎంత గొప్ప సంభాషణ’

ఈ కవిత చదివిన అభిమానులు తనను పొగడ్తలతో ముంచెత్తారు. కొందరైతే అసలు మాకు కవితలంటేనే పడదు కానీ, నువ్వు రాసిన కవితలు చదివాక వాటి గురించే ఆలోచిస్తున్నామని.. మా ఫేవరెట్ కవయిత్రి నువ్వే అని చెప్తున్నారు. కృతి సినిమాల్లో పాటలు ఎందుకు రాయకూడదని సలహాలు కూడా ఇస్తున్నారు.

Advertisement

Next Story