ప్రెగ్నెంట్ అయ్యేందుకు చాలా శ్రమించానంటున్న కృతి సనన్

by Jakkula Samataha |
krithi-sanan
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ లేటెస్ట్ పిక్చర్ ‘మిమి’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలో సరోగసి మదర్‌గా కనిపిస్తుండగా.. పంకజ్ త్రిపాఠి కీ రోల్ ప్లే చేస్తున్నారు. కామిక్‌గా స్టార్ట్ అయిన ట్రైలర్‌లో ఫారినర్ కపుల్స్ నుంచి సరోగసి ఆఫర్ తీసుకొచ్చిన పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించగా.. ఇందుకోసం కోటి రూపాయలు చెల్లిస్తామని చెప్పడంతో అగ్రిమెంట్‌కు ఓకే చెప్తుంది. కానీ మధ్యలోనే ప్రెగ్నెంట్ అబార్ట్ చేయమని కపుల్స్ కోరడంతో స్టోరీలో సీరియస్‌నెస్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి సినిమాలో కొత్తదనం కనిపించబోతోందని ట్రైలర్ ద్వారా అర్థమవుతుండగా.. మూవీలో ప్రెగ్నెంట్ ఉమన్‌గా కనిపించేందుకు కృతి చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్‌కు రియాలిటీ యాడ్ చేసేందుకు 15 కిలోల వెయిట్ పెరిగినట్లు సమాచారం. కాగా, జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న ‘మిమి’ ద్వారా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకు కృతి రెడీ అయిపోయింది.

Advertisement

Next Story