‘పార్వతీ బాయి’ జ్ఞాపకాల్లో కృతిసనన్..

by Anukaran |   ( Updated:2023-04-01 16:55:51.0  )
‘పార్వతీ బాయి’ జ్ఞాపకాల్లో కృతిసనన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : చార్మింగ్ బ్యూటీ కృతిసనన్ ‘పార్వతీ బాయి’గా ప్రేక్షకుల ముందుకొచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందిన ‘పానిపట్’ చిత్రం 2019, డిసెంబర్ 6న విడుదలైంది. ఆ చిత్రంలో ‘పార్వతీ బాయి’గా తొలిసారి ఓ చారిత్రాత్మకమైన చిత్రంలో నటించిన కృతి.. ఆనాటి రోజులను గుర్తుచేసుకుంది.

‘పానిపట్’ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడు అశుతోష్ ‘హ్యపీ బర్త్ డే పార్వతి బాయి’ అని కృతికి మెసేజ్ చేశాడు. అందుకు కృతి భావోద్వేగం చెందడమే కాకుండా పార్వతి బాయి తనకు ఇచ్చినందుకు అశుతోష్‌కు థాంక్స్ చెప్పింది. ‘జీవితాంతం గుర్తుంచుకునే పాత్రను ఇచ్చినందుకు కేవలం కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టుకోలేనన్న కృతి.. తన మొదటి పీరియాడిక్ ఫిల్మ్‌లోని హిస్టారిక్ క్యారెక్టర్‌లో నవారీ చీరలో కత్తి దూయడం తనకు ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పింది. ‘ఇదంతా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే. ఓ మహిళా వార్ ఫిల్మ్‌ను కేవలం మీరు మాత్రమే అలా నెరేట్ చేయగలరు. లవ్ యూ సార్ అండ్ ఐ మిస్ యూ రాయా (అర్జున్ కపూర్)’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. పానిపట్‌లోని ఓ సీన్ చేస్తుండగా తన నోట్లోకి విపరీతమైన దుమ్ము, ధూలి పోయిందని, కానీ ఆ సీన్ చూస్తే దాని విలువ అర్థమవుతుందని, దానికోసం కష్టపడటంలో తప్పులేదని కృతి అభిప్రాయపడింది.

ఇక కృతి త్వరలోనే అక్షయ్ కుమార్‌తో కలసి ‘బచ్చన్ పాండే’ షూటింగ్‌లో అడుగుపెట్టనుంది. అలానే ‘మిమి’ అనే సినిమాలో స్ట్రాంగ్ మదర్ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్న కృతి.. హిలేరియస్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌టైనర్‌గా వస్తున్న ‘హమ్ దో హమారే దో’ అనే సినిమా కూడా చేస్తోంది. ఇందులో రాజ్ కుమార్ రావుతో పాటు వరుణ్ ధావన్‌ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed