వలంటీర్లకు కలెక్టర్ కీలక ఆదేశాలు

by srinivas |   ( Updated:2021-03-06 08:26:51.0  )
MD Imtiaz
X

దిశ, వెబ్ డెస్క్: గ్రామ/వార్డు వలంటీర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్ధలతోపాటు మిగిలిన పురపాలక సంఘాల ఎన్నికల్లో వలంటీర్లు పాల్గొనకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలకు లబ్దిచేకూర్చేలా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేయడాన్ని నేరమన్నారు. అటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వలంటీర్లపై ఫిర్యాదులు ఉంటే కృష్ణా జిల్లాలో 8186038738 వాట్సాప్‌ నంబర్‌కు పంపాలని కలెక్టర్ ను ఆదేశించారు.

Advertisement

Next Story