- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థర్డ్ వేవ్ దూసుకొస్తోంది.. జాగ్రత్తగా ఉండండి
దిశ, కొత్తగూడ: ఒమిక్రాన్ వైరస్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ చాపకింద నీరులా విస్తృతంగా వ్యాప్తిచెందుతోందని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కొత్తగూడ, గంగారం ఎస్ఐలు నాగేష్, ఉపేందర్‌లు సూచించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐలు మహమ్మారిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండేండ్ల నుంచి యావత్ ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కంటిమీద కునుకులేకుండా చేసిందని, దానిని ప్రభావం ఇంకా అందరిపై ఉందని అన్నారు.
ఫస్ట్ వేవ్, సెకండ్ బారినపడి అతలాకుతలం అయిన కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న సమయంలో మళ్లీ ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ దూసుకొస్తోందని, దీంతో కొత్తగూడ, గంగారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మాస్కు తప్పనిసరిగా ధరిస్తూ, భౌతికదూరం పాటించాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు, హెల్మెట్ లేనివారికి జరిమానా విధించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు వంశీ, వెంకన్న, సుధాకర్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.