- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం.. రేవంత్‌తో జతకట్టిన సీనియర్లు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ టీ-కాంగ్రెస్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రెండు రోజుల వరి దీక్ష కొనసాగుతోంది. రేవంత్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దీక్షలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. అయితే, దీక్ష స్థలిలో ఓ అనూహ్య ఘటన కాంగ్రెస్ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించడాన్ని తప్పుపడుతూ ఇన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష స్థలిలో రేవంత్‌తో కలిసి ముచ్చటిస్తూ కనిపించారు. దీనిని చూసిన కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా నినాదాలు చేయడం మొదలెట్టారు. రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య సంధి కుదిరిందా అంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ దీక్షలో సీనియర్ నేత, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం.
సుదీర్ఘ గ్యాప్ తరువాత ఒకే వేదికను పంచుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు రేవంత్ రెడ్డి.. @revanth_anumula @KomatireddyKVR pic.twitter.com/h9pL9MEBgv
— Share Telangana (@ShareTelangana) November 27, 2021