బిగ్ బ్రేకింగ్ : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్

by Anukaran |   ( Updated:2021-07-28 01:17:05.0  )
బిగ్ బ్రేకింగ్ :  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : నల్లగొండ జిల్లా మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత బంధు కోసం చలో మునుగోడుకు వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడ్డుకున్నారు. మునుగోడుకు రాకుండా అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత బొంగులూరు గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్‌లో పెట్టినట్టు మునుగోడులో కూడా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 10 వేల మంది కార్యకర్తలతో మునుగోడులో నిరసన కార్యక్రమానికి సిద్ధం కావడంతో ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు.

Advertisement

Next Story