- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి జగదీష్ రెడ్డికి మరో షాక్.. భారీ ప్లాన్ వేసిన కోమటిరెడ్డి
దిశ, మునుగోడు: హుజురాబాద్ తరహాలోనే మునుగోడు నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలు చేయాలంటూ.. 10వేల మందితో నిరసన కార్యక్రమాన్ని చేపడుతామని.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పల్లెంలలో దీక్ష చేపడుతున్న షర్మిలతో ఆయన ఫోన్ కాల్‌లో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు నియోజకవర్గంలో సెగ పుట్టిస్తున్నాయి. బుధవారం మునుగోడులో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆహారభద్రత కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. అదే రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో నియోజకవర్గ కేంద్రంలో ఏం జరగబోతుందోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆహారభద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో హాజరైన జగదీశ్వర్ రెడ్డిని మాట్లాడనీయకుండా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మైక్ లాక్కోవడంతో రసాభాస జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మంత్రిని తిరగనివ్వం అంటూ సవాల్ విసిరారు. దీంతో రేపు జరగబోయే మంత్రి కార్యక్రమాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే అవకాశం లేకపోలేదు. దీంతో నియోజకవర్గ కేంద్రంలో క్షణక్షణం ఉత్కంఠగా కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది.