చిత్తూరులో ఇద్దరికి కత్తిపోట్లు..

by srinivas |
చిత్తూరులో ఇద్దరికి కత్తిపోట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ వాలంటీర్, అతని బంధువుపై కిరాయి గుండాలు కత్తితో దాడిచేశారు. ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలం గాజుల పెల్లూరు గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడంలో గ్రామ వాలంటీర్ ప్రకాశ్ వివక్ష చూపిస్తున్నాడనే కారణంతో కొందరు ఉద్దేశపూర్వకంగా అతనిపై దాడి చేసినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా, ఆ సమయంలో వారిని అడ్డుకోవాలని ప్రయత్నించిన అతని బంధువుపై కూడా కిరాయి గూండాలు కత్తితో దాడి చేశారని పలువురు అనుమానిస్తున్నారు.

క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని అదుపులోకి విచారిస్తున్నారు. కాగా, ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story