IPL : రికార్డు క్రియేట్ చేసిన సునీల్ నరైన్.. ధోని, కోహ్లీ, రోహిత్ తర్వాత అతనే..

by Anukaran |   ( Updated:2021-12-16 00:29:59.0  )
IPL : రికార్డు క్రియేట్ చేసిన సునీల్ నరైన్.. ధోని, కోహ్లీ, రోహిత్ తర్వాత అతనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్, వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ ఐపీఎల్‌గా మరో రికార్డు క్రియేట్ చేశాడు. ఏబీ డివీలియర్స్ రికార్డుపై నరైన్ కన్నేశాడు. విషయం ఏంటంటే.. ఐపీఎల్‌లో నరైన్ రూ.100 కోట్లు ఆర్జించిన రెండో విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. వచ్చే ఏడాది ఐపీఎల్​సీజన్‌తో కలిపి 11 సార్లు కేకేఆర్​తరఫున ప్రాతినిధ్యం ప్లేయర్‌గా నరైన్ నిలవడంతో ఈ ఘనతను సాధించాడు. రిటెన్షన్ ప్రక్రియలో కేకేఆర్‌ను నరైన్ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. 10 సీజన్లు కలిపి సునీల్ నరైన్ రూ. 95.6 కోట్లు పొందాడు. వచ్చే సీజన్ సంపాదన రూ. 6 కోట్లతో కలిపి నరైన్ రూ. 100 కోట్లు పొందిన క్లబ్‌లో చేరాడు. నరైన్ కన్నా ముందు RCB ప్లేయర్ ఏబీ డివిలియర్స్.. రూ. 100 క్లబ్‌లో చేరిన ఫస్ట్ విదేశీ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో రూ. 100 కోట్లు క్రాస్ చేసిన ప్లేయర్స్ వీరే..

1. మహేంద్ర సింగ్ ధోనీ- CSK – రూ. 152.8 కోట్లు.
2. రోహిత్ శర్మ- MI – రూ. 146.6 కోట్లు.
3. విరాట్ కోహ్లీ- RCB – రూ. 143.2 కోట్లు.
4. సురేశ్ రైనా- CSK – రూ. 110 కోట్లు.
5. ఏబీ డివిలియర్స్ – RCB – రూ. 102 కోట్లు.
6. సునీల్ నరైన్- KKR- రూ. 100 కోట్లు (2022 సీజన్‌తో కలిపి).

టీమిండియా, SRH బౌలర్ నటరాజన్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Advertisement

Next Story

Most Viewed