కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్

by Anukaran |
కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. పాకిస్థాన్ కు చెందిన కొందరు దుండగులు వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, ఈ వెబ్ సైట్ ను కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాకముందు నుంచే తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్రమంత్రి అయ్యాక ఈ వెబ్ సైట్ ను అంతగా వినియోగించలేదు. ఈ మధ్యే ఆ వెబ్ సైట్ ను ఓపెన్ చేయగా హ్యాక్ కు గురైనట్లు గర్తించారు. హ్యాక్ చేసిన పాకిస్థాన్ కు చెందిన దుండగులు భారతదేశాన్ని దూషిస్తూ అందులో కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు సమాచారం.

Advertisement

Next Story