కిషన్‌రెడ్డి పుట్టక ముందే తెలంగాణలో రైళ్లు

by Shyam |
కిషన్‌రెడ్డి పుట్టక ముందే తెలంగాణలో రైళ్లు
X

”తెలంగాణ ప్రజలకు ఎర్ర బస్సు తప్ప రైలు ప్రయాణం తెలియదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలకు రైలు ప్రయాణం అందుబాటులో వచ్చింది” అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలపై యావత్ తెలంగాణ ప్రజానీకం విరుచుకుపడుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రజలు కిషన్‌రెడ్డి వాఖ్యలపై కౌంటర్లు విసురుతున్నారు. ”నీవు పుట్టకముందే తెలంగాణ ప్రాంతంలో రైళ్ళు తిరిగాయి. 1879 నుంచి నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే ద్వారా ఈ ప్రాంతంలో రైలు మార్గం ఉందన్న విషయం తెలుసుకోవాలి” అనే వ్యాఖ్యలు దర్శనమిచ్చాయి. తెలంగాణ ప్రాంతంతో భారతదేశానికి ఎలాంటి సంబంధం లేనప్పటి నుంచే ఈ ప్రాంత ప్రజలు రైళ్ళలో తిరిగారని, ఆ విషయాన్ని తెలంగాణ గడ్డమీద పుట్టిన కిషన్‌రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి తెలుసుకోకుండా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎర్ర బస్సు తప్ప మరోటి తెలియదనడంలో ఆయనకు తెలంగాణ ప్రాంతం పై ఉన్న అవగాహన ఏపాటిదో అర్థమవుతోందంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణలో రైలుమార్గం మెరుగుపడింది అనడం ఆయన అవివేకమంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వాఖ్యలను ఖండిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed