అంబర్​పేట ఫ్లైఓవర్​ను త్వరగా పూర్తి చేయాలి: కిషన్‌రెడ్డి

by Shyam |
అంబర్​పేట ఫ్లైఓవర్​ను త్వరగా పూర్తి చేయాలి: కిషన్‌రెడ్డి
X

దిశ, న్యూస్​బ్యూరో: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభిృద్ధి నిధులతో చేపట్టిన కార్యక్రమాల అమలు, ప్రస్తుత ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి శనివారం దిల్​కుషా గెస్ట్​హౌస్​లో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, నాబార్డ్, హడ్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతితో అన్ని గృహనిర్మాణ పథకాలు, గృహాల కేటాయింపు తదితర అంశాలు చర్చించారు. అంబర్​పేట గౌతులచ్ఛన్న ఆడిటోరియం (జ్యోతిబాయ్ ఫూలే బీసీ సంక్షేమ భవన్) నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంబర్​పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి చర్చించి, నిర్మాణ పురోగతిని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​‌ను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్​ను ఆదేశించారు. బస్తీ దవాఖానాల పనితీరు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆత్మ నిర్భర్ యోజన కింద వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో అధికారుల చొరవను కిషన్​‌రెడ్డి అభినందించారు.n

Advertisement

Next Story