- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'డిమాండ్ లేకుండా ఆర్థిక పునరుజ్జీవనం ఎలా సాధ్యం'
దిశ, సెంట్రల్ డెస్క్ : కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు కేవలం ఆర్థిక మనుగడకు మాత్రమే సరిపోతాయని బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. ఇలాంటి సమయంలో డిమాండ్‌ను సృష్టించగలిగే అవకాశాన్ని కోల్పోయామని ఆమె నిరాశను వ్యక్తపరిచారు. దేశంలో కొనుగోళ్లు పెరగాలంటే జీఎస్‌టీ తగ్గించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కొనుగోళ్లకు స్వల్ప కాలిక ఉపశమనం లభించాలని, కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు జీఎస్టీ భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.సరఫరా జరిగేందుకు ద్రవ్య లభ్యత సృష్టించాం. అయితే, ఆర్థిక పునరుజ్జీవానికి ముఖ్యమైనది డిమాండ్. దాన్ని విస్మరించడం సరైనదేనా అని ప్రశ్నించారు. డిమాండ్ పెరగకుండా ఆర్థిక పునరుజ్జీవం ఎలా సాధ్యపడుతుందని అన్నారు.
పరిశ్రమ వర్గాలను.. ఉద్యోగుల వేతనాలు చెల్లించమని కోరడం అన్యాయంగా ఉందని, డిమాండ్ లేని సంస్థలకు ఇది చాలా కష్టతరమన్నారు. పరిశ్రమలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోతే రాబోయే సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇదే సందర్భంలో వలస కార్మికుల పరిస్థితిపై కిరణ్ మజుందార్ ఆందోళన వ్యక్తం చేశారు. వలస కార్మికులను పట్టించుకోకపోవడం దారుణమని, దీనికి మనం సిగ్గుపడాలని, అభివృద్ధి చెందాలని ఆలోచన ఉన్న దేశానికి ఇది మంచిది కాదన్నారు. పేదలకు సామాజిక భద్రతలో భాగంగా కనీస ప్రాతిపదికన ఆదాయాన్ని ప్రకటించాలని ఆమె ఆశించారు. ప్యాకేజీపై స్పందించిన కిరణ్..సంస్కరణల పరంగా వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం లభించిందని చెప్పారు. అయితే, ఆధునికీకరణలో వారికి మరిన్ని ప్రోత్సహకాలు లభించాలని అభిప్రాయపడ్డారు. వీటన్నిటితో పాటు పెరుగుతున్న కరోనా కేసుల కంటే మరణాల రేటుపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. పెరిగే కేసులకు గురించి కాకుండా మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆమె సూచించారు.