పంజాబ్ పేలవ ప్రదర్శన

by Shyam |   ( Updated:2020-10-24 10:39:18.0  )
పంజాబ్ పేలవ ప్రదర్శన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 43వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ పేలవ ప్రదర్శన చేసింది. 66 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలడం, మిడిలార్డర్‌లో మిగతా బ్యాట్స్‌మెన్లు రాణించకపోవడంతో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్‌ బౌలర్లు తొలి నుంచి సమిష్టిగా రాణిస్తూ కీలక సమయాల్లో పంజాబ్ వికెట్లను తీసుకున్నారు.

పంజాబ్ ఇన్నింగ్స్:

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బౌలర్లు కుప్పకూలారు. నికోలస్ పూరన్(32) నాటౌట్‌గా నిలిచినా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (27), క్రిస్ గేల్(20), మందీప్ సింగ్(17) పరుగులు మాత్రమే చేశారు. మిగతా ఏ ఆటగాడు కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (12), క్రిస్ జోర్డన్ (7), మురుగన్ అశ్విన్ (4) పరుగులతో సరిపెట్టుకున్నారు. ఇది కాకుండా దీపక్ హుడా (0) డకౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులతోనే సరిపెట్టుకుంది.

స్కోరు బోర్డు:

Kings XI Punjab Innings:
1. కేఎల్ రాహుల్ (c) (wk) b రషీద్ ఖాన్ 27(27)
2. మందీప్ సింగ్ c రషీద్ ఖాన్ b సందీప్ శర్మ 17(14)
3. క్రిస్ గేల్ c వార్నర్ b హోల్డర్ 20(20)
4. నికోలస్ పూరన్ నాటౌట్ 32(28)
5. గ్లెన్ మ్యాక్స్‌వెల్ c వార్నర్ b సందీప్ శర్మ 12(13)
6. దీపక్ హుడా st బెయిర్ స్టో b రషీద్ ఖాన్ 0(2)
7. క్రిస్ జోర్డన్ c కలీల్ అహ్మద్ b హోల్డర్ 7(12)
8. మురుగన్ అశ్విన్ రనౌట్ (విజయ్ శంకర్)4(4)
9. రవి భిష్ణోయ్ నాటౌట్ 0(0)

ఎక్స్‌ట్రాలు: 7

మొత్తం స్కోరు: 126

వికెట్ల పతనం: 37-1 (మందీప్ సింగ్, 4.6), 66-2 (క్రిస్ గేల్, 9.6), 66-3 (కేఎల్ రాహుల్, 10.1), 85-4 (గ్లెన్ మ్యాక్స్‌వెల్, 13.4), 88-5 (దీపక్ హుడా, 14.2), 105-6 (క్రిస్ జోర్డన్, 17.3), 110-7 (మురుగన్ అశ్విన్, 18.2)

బౌలింగ్:

1. సందీప్ శర్మ 4-0-29-2
2. కలీల్ అహ్మద్ 4-0-31-0
3. జోస్ హోల్డర్ 4-0-27-2
4. రషీద్ ఖాన్ 4-0-14-2
5. టీ.నటరాజన్ 4-0-23-0

Advertisement

Next Story