- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఐపీఎల్ 13వ సీజన్‌లోని 46వ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్ ప్లస్ పాయింట్ కానుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ గెలిచేందుకు కెప్టెన్లు తహతహలాడుతున్నారు.
అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమి చెందితే… దాదాపు ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు అయినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ పంజాబ్ ఆడిన 11 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్‌లు ఆడగా ఆరింట్లో గెలిచింది. అయితే వరుసగా జోరు మీద ఉన్న రెండు జట్లు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని చూస్తున్నాయి. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్ వంటి స్టార్ బ్యాట్ మెన్స్ ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కు కలిసివస్తుంది. అలాగే సునీల్ నరైన్, నితీశ్ రానా వంటి వంటి ఆటగాళ్లు సైతం అద్భుతమైన ఫామ్‌లోకి రావడం కోల్‌కతాను కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.