నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో నాగార్జున ‘వైల్డ్ డాగ్’

by Shyam |
nag wild dog
X

దిశ, సినిమా: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ ప్లే చేసిన ఫెరోషియస్, పాట్రియాటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 2న రిలీజైన చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో గురువారం విడుదల కాగా, అక్కడ కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఇండియా ట్రెండింగ్‌లో తెలుగు వర్షన్ ‘వైల్డ్ డాగ్’ నెం.1 ప్లేస్‌లో ఉంది. ఎన్ఐఏ సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో హైదరాబాద్, పుణె బాంబు పేలుళ్ల వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో ‘కింగ్’ నాగార్జున, ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దియామీర్జా పర్ఫార్మెన్సెస్‌తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్సెస్‌లో నాగార్జున ఇరగదీయగా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, ప్రకాష్ సుదర్శన్ ఇతర పాత్రలు పోషించారు.

Advertisement

Next Story