చిన్నారులు విరాళాలు అందించడం అభినందనీయం

by Aamani |
చిన్నారులు విరాళాలు అందించడం అభినందనీయం
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ నిర్మూలన కోసం కృషి చేస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు చిన్నారులు సైతల విరాళాలు అందించడం అభినందనీయమని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. మంగళవారం నిర్మల్‌కు చెందిన శ్రీరామ టింబర్ డిపో యజమాని జద్వాణి రావుజీ భాయ్ అండ్ బ్రదర్స్ రూ. లక్ష అందజేశారు. ఏఎన్ రెడ్డి కాలనీకి చెందిన రుషిల్ రూ. 5 వేలు, కూరన్నపేటకు చెందిన హర్ష కిడ్డీ బ్యాంకులోని డబ్బులను కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ బాధితుల సహాయార్థం జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ నిధికి దాతలు విరాళాలు అందించడం అభినందనీయమన్నారు.

Tags: corona out break, donations to cmrf, adilabad, collector

Advertisement

Next Story