ఫ్లాష్ ఫ్లాష్ : నిజామాబాద్‌లో కిడ్నాప్ కలకలం..

by Sumithra |   ( Updated:2021-07-27 22:50:53.0  )
ఫ్లాష్ ఫ్లాష్ : నిజామాబాద్‌లో కిడ్నాప్ కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్ : నిజామాబాద్ జిల్లా బోధన్‌ పట్టణంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ముంతాజ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు రూ.2లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత కుటుంబం గత్యంతరం లేక విశ్వ అనే వ్యక్తికి రూ.2 లక్షలు చెల్లించింది.

అయితే, డబ్బులు ఇచ్చాక కిడ్నాపర్ల చెరలో బంధీగా ఉన్న ముంతాజ్ తప్పించుకున్నాడు. అనంతరం కిడ్నాప్ వ్యవహారంపై ముంతాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.2లక్షలు, కత్తి, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed