సినిమా నా ఐడెంటిటీ : కిచ్చా సుదీప్

by Shyam |
Kicha Sudeep
X

దిశ, సినిమా: హీరో కిచ్చా సుదీప్ కన్నడ బిగ్ బాస్ హోస్ట్‌గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం మరో సీజన్‌ను ప్రారంభించబోతున్న సందర్భంగా ఇందుకు సంబంధించిన అనుభవాలను షేర్ చేసుకున్నాడు. ఏడేళ్లుగా ఈ రియాలిటీ షోతో అనుబంధం ఉందని, ప్రతీ సీజన్.. ఆడియన్స్‌ను మాత్రమే కాదు తనను కూడా సర్‌ప్రైజ్ చేస్తుందన్నాడు. ఈసారి కూడా అంతే ఎగ్జైట్‌మెంట్‌తో షో కోసం ఎదురుచూస్తున్నానని, కంటెస్టెంట్ల పేర్లు, వారి ప్రయాణం గురించి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్‌, హోస్టింగ్ మధ్య తేడా ఏంటన్న ప్రశ్నపై స్పందించిన సుదీప్.. ‘షూటింగ్‌లో ఏం చేయాలో ఒక ఐడియా ఉంటుంది, కానీ రియాలిటీ షో హోస్ట్ చేస్తున్నప్పుడు కంటెస్టెంట్ల రియాక్షన్ మీద నెక్స్ట్ మూవ్ ఆధారపడి ఉంటుంది. దీనికి ప్రిపరేషన్ ఉండదు’ అని తెలిపారు. షూటింగ్, హోస్టింగ్‌లో బెటర్ ఏది చూజ్ చేసుకుంటారు అంటే ‘నేను నా జీవితాన్ని ఇష్టపడుతున్నాను, ఏమి చేస్తున్నానో అది నా ఎంపిక. సినిమా నా గుర్తింపు, కానీ బిగ్ బాస్ నాకు చాలా దగ్గరైంది’ అని సుదీప్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed