- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహన సర్వీసుల్లో కియా మరో ముందడుగు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 నేపథ్యంలో భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని కియా మోటార్స్ ఇండియా తన వినియోగదారుల కోసం పూర్తిగా కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ వాహన సర్వీసులను గురువారం ప్రారంభించింది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ పూర్తిగా పేపర్‌లెస్ ప్రక్రియలో కాంటాక్ట్ పిక్-అప్ అండ్ డ్రాప్ సేవలను కంపెనీ ప్రకటించింది.
అలాగే, వినియోగదారులకు వ్యక్తిగత వాహన మెయింట్‌నెన్స్ కోసం ‘మై కన్వినియెన్స్’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తూ, డిజిటలైజ్ ద్వారా వాహనాలను కొన్న తర్వాత కొత్త అనుభవాన్ని అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.
‘ప్రస్తుత పరిస్థితుల్లో కస్టమర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. పూర్తిస్థాయిలో కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ ప్రక్రియ ద్వారా వాహనాల అమ్మకాల తర్వాత సర్వీసులను ప్రవేశపెట్టిన దేశీయ తొలి ఒరిజినల్ పరికరాల తయారీదారుగా ఉన్నందుకు గర్వంగా ఉంది. ఈ కొత్త కార్యక్రమాన్ని దీపావళి బహుమతిగా తమ కస్టమర్లకు ఇవ్వాలని నిర్ణయించాం’ అని కియా మోటార్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ సేల్స్ ఆఫీసర్ టే-జిన్ పార్క్ చెప్పారు.