- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఖుష్బూకు చుక్కలు చూపించిన హ్యాకర్స్
by Shyam |

X
దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు ఖష్బూ ట్విట్టర్ ఎకౌంట్ మరోసారి హ్యాక్ అయింది. ఏప్రిల్ 2020లోనే తన ట్విట్టర్ హ్యాక్ కాగా.. తాజాగా మరోసారి అలాంటి ప్రాబ్లమే ఎదురైనట్లు తెలిపింది. అయితే ఈసారి తన పేరును బ్రియాన్‌గా చేంజ్ చేసిన హ్యాకర్.. ఫొటో కూడా చేంజ్ చేశాడు. ఇంతకు ముందున్న ట్వీట్స్ అన్ని డిలీట్ చేసి ఎలాంటి ఇన్‌ఫర్మేషన్ అందుబాటులో లేకుండా చేశాడు. మూడురోజులుగా పాస్ వర్డ్ చేంజ్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదన్న ఖుష్బూ.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తన ఎకౌంట్ హ్యాకింగ్ గురించి ట్విట్టర్ మేనేజ్‌మెంట్‌కు సమాచారమిచ్చినా ఎలాంటి సహాయం చేయలేకపోయారని తెలిపింది. తన అకౌంట్ సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారని, ఈ సమస్య పరిష్కారానికి సహాయం చేయాలని కోరింది.
Next Story