మంత్రి అహంకారం.. కనీస గౌరవం ఇవ్వడం లేదు

by Sridhar Babu |
మంత్రి అహంకారం.. కనీస గౌరవం ఇవ్వడం లేదు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ప్రజా ప్రతినిధుల హక్కులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భంగం కలిగిస్తున్నార‌ని, స్థానిక విపక్ష ప్రజా ప్రతినిధుల‌పై అహంకారపూరిత ధోరణి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని జిల్లా కాంగ్రెస్ నాయ‌కులు మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేట‌ర్ల డివిజ‌న్ల‌లో జ‌రిగే అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ప్రొటోకాల్ ప్ర‌కారం… గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అన్నారు.

మంత్రి వైఖ‌రిని నిర‌సిస్తూ గురువారం కాంగ్రెస్ నాయ‌కులతో ఆయ‌న డీసీసీ భ‌వ‌న్‌లో నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మా పార్టీ కార్పొరేటర్ 37వ డివిజన్ ప్రజాప్రతినిధి యర్రం బాలగంగాధర్ తిలక్, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా తన ఆధ్వర్యంలో లేదా సమక్షంలో నిర్వహించాల్సి ఉండ‌గా, అధికార పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల ఒత్తిడితో క‌నీసం ప్రొటోకాల్ పాటించ‌డం లేద‌ని ఆరోపించారు.

గత రెండు వారాల్లో జరిగిన సంఘటనలే మంత్రి అజ‌య్‌కుమార్ వైఖ‌రినికి నిద‌ర్శ‌న‌మ‌ని, మ‌ద్దుల‌ప‌ల్లి స‌ర్పంచ్ విష‌యాన్ని ఉద్దేశించి అన్నారు. మంత్రి పదవి ఉంద‌న్న అహంకారంతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని తెలిపారు.

Advertisement

Next Story