ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డికి కీలక బాధ్యతలు

by Shyam |
Vamsichand Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వంశీచంద్ ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుండగా.. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌కు సహాయకుడిగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూడనున్నారు. వంశీచంద్ రెడ్డి గతంలో ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

కాగా వంశీచంద్​రెడ్డికి ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్​గౌడ్​ అభినందనలు తెలిపారు. ఎన్ఎస్‌యూఐ నేత నుంచి ఏఐసీసీ స్థాయికి వెళ్లారని, పార్టీకి విధేయుడిగా ఉండటంతో మంచి అవకాశాలు వచ్చాయని సుధాకర్​ గౌడ్​ అభినందించారు.

Advertisement

Next Story