నా కోరిక తీర్చేదెవరో అంటున్న 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ..

by Shyam |   ( Updated:2021-12-04 10:49:43.0  )
ketika
X

దిశ, సినిమా: ఢిల్లీ భామ కేతిక శ‌ర్మ ప్రస్తుతం టాలీవుడ్ హీరోల క్రష్‌‌గా మారింది. కేతిక హవా ఎలా నడుస్తుంది అంటే ఏకంగా ఓ టాలీవుడ్ హీరోనే కేతిక శర్మను చూస్తే రొమాన్స్ చేయాలనిపిస్తుంది అన్నాడు. ఆకాశ్ పూరి రొమాంటిక్ మూవీలో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌కి పరిచయం అయింది కేతిక. తెలుగులో అమ్మడు చేసింది ఒక సినిమానే అయినా చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. రొమాంటిక్ సినిమా షూటింగ్ పూర్తి చేయగానే టాలీవుడ్‌లో మరో సినిమా ఒప్పుకుంది. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన లక్ష్య సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 10న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

అయితే కేతిక తనకు ఎలాంటి పాత్రలో నటించాలనుందో చెప్పింది. ఈ రొమాంటిక్ బ్యూటీ తనకు స్పోర్ట్స్ అంటే ఇష్టం అని చెప్పింది. తాను స్టేట్ లెవెల్ స్విమ్మర్ అని, మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్ అని తన టాలెంట్ గురించి ఒపెన్ అయింది. తనకు స్విమ్మింగ్ బేస్డ్ సినిమాలో నటించాలనుంది అని తన డ్రీమ్ గురించి తెలిపింది. దీంతో అభిమానులు కేతిక కోరికను ఏ దర్శకుడు తీరుస్తాడో అని కామెంట్స్ చేస్తున్నారు.

పవర్‌ స్టార్ కూతురా మజాకా.. ఆద్య వీడియో వైరల్

Advertisement

Next Story