బతుకమ్మ మన పండుగ.. మన సంస్కృతి : రవీందర్ యాదవ్

by Shyam |
Keshampet MPP Ravinder Yadav
X

దిశ, షాద్‌నగర్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కేశంపేటలో మండల ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో కోలాటాలు ఆడారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆడపడుచులు ఎంతో సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ మన పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ అనురాధ పర్వత్ రెడ్డి, ఎంపీడీఓ చంద్రకళ, ఐసీడీఎస్ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, సర్పంచ్‌లు తలసాని వెంకట్ రెడ్డి, నవీన్ కుమార్, కో-ఆప్షన్ సభ్యుడు జమాల్ ఖాన్, ఎంపీటీసీ మల్లేష్ యాదవ్, వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed