గూగుల్ నుంచి ‘కీన్’ యాప్

by Harish |
గూగుల్ నుంచి ‘కీన్’ యాప్
X

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం.. గూగుల్ నుంచి పింటరెస్ట్‌ యాప్‌కు పోటీగా గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ‘కీన్’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. వెబ్, ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఈ యాప్ అందుబాటులోకి రాగా.. ఇందులో యూజర్లు తమ ఐడియాస్, లింక్స్‌ను రిసోర్స్‌లతో పాటు తమకు నచ్చిన ఏ టాపిక్ మీదనైనా షేర్ చేసుకునే వీలుంది.

ఇంట్లో అందంగా కేకు తయారు చేశారా? పక్షులు, పెట్ డాగ్స్‌తో హ్యాపీగా ఆడుకుంటున్నారా? టైపోగ్రఫీ‌పై రీసెర్చ్ చేస్తున్నారా? టాపిక్ ఏదైనా సరే.. ‘కీన్’లో షేర్ చేసుకోవచ్చని ఆ సంస్థ సీఈవో తెలిపారు. ఇష్టమైన ఫోటోలను షేర్ చేసుకోవడంతో పాటు కొత్త ఫ్రెండ్స్‌ను ఇన్వైట్ చేయొచ్చు. మనం షేర్ చేసిన కంటెంట్ ప్రకారం.. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్, న్యూస్‌ కూడా యూజర్‌కు అందుబాటులో ఉండనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘కీన్ అనేది అభిరుచులకు, ఆసక్తులకు ఓ వేదిక లాంటిది. మన ఇంటరెస్ట్ ప్రకారం ఇక్కడ ఏదైనా నేర్చుకోవచ్చు. కొత్త కొత్త హాబీస్ అలవరుచుకోవచ్చు. గూగుల్‌లోకి వెళ్లగానే ఓ ఆలోచన లేకుండా.. స్క్రోల్ చేస్తూ వెళ్లకుండా.. అన్ని టాపిక్స్ ఒకే చోట ఉంటాయి. ఇది పింటరెస్ట్ వంటిందని చాలా మంది అంటున్నారు. కానీ ఆ యాప్‌తో పోల్చితే.. ఇది చాలా భిన్నంగా ఉంటుందని సీఈవో ఆడమ్స్ అంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed