‘ఫోన్ చేయండి.. సాయం చేస్తాం’

by Shyam |
‘ఫోన్ చేయండి.. సాయం చేస్తాం’
X

దిశ, మెదక్: లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులకు సంబంధించి ఎలాంటి సాయం కావాలన్నా తమకు ఫోన్ చేస్తే వచ్చి అందజేస్తామని సిద్దిపేట జిల్లాలోని కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు తెలిపారు. సిద్దిపేట మైత్రివనం, ఆటోనగర్‌ల వద్ద ఉన్న వలస కూలీలకు 10 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారు తమ ఫోన్ నంబర్: 9949930005ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదరు సేవాసమితి అధ్యక్షులు చీకోటి మధుసూదన్, ఉపాధ్యక్షులు కాచం కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Tags: coronavirus, kedarnath sevasamithi, siddipet, mythrivanam, lockdown, migrant labourers, essential goods

Advertisement

Next Story

Most Viewed