కేసీఆర్ సంచలన నిర్ణయం.. వరి వేస్తే రైతుబంధు కట్.?

by Anukaran |   ( Updated:2021-12-16 03:57:13.0  )
కేసీఆర్ సంచలన నిర్ణయం.. వరి వేస్తే రైతుబంధు కట్.?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి సాయం కింద సర్కార్ ‘రైతుబంధు’ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతులకు రైతుబంధు సాయాన్ని ఇవ్వనున్నట్టు గతంలో నియంత్రిత సాగు విధానాన్ని ప్రకటించిన సమయంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉందనడంలో సందేహం లేదు.

ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో వరి సాగును నియంత్రించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పటికే యాసంగిలో రైతులు వరి వేయొద్దని, ప్రభుత్వం కొనుగోలు చేయదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రైతులు మాత్రం వరి వేసేందుకే మొగ్గుచూపడంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు తీసుకెళ్లాలంటే రైతుబంధు పై పలు ఆంక్షలు తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటు, అధికార పార్టీకి చెందిన ఓ పత్రికలో వచ్చిన వార్తలను చూస్తుంటే వరి వేయని వారికే రైతుబంధు అన్న సంకేతాలు రైతులకు ఇస్తున్నట్లు నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.

ఈ వార్తా కథనంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘తన మెడ మీద కేంద్రం కత్తి పెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చానని చెప్పిన అసమర్ధ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు మెడ మీద రైతుబంధు కత్తి పెట్టి వరి వేయవద్దంటున్నాడు. రైతుబంధు ఎత్తేసే కుట్రకు ఇది తొలి అడుగు. పరాహుషార్ రైతన్నా!’ అంటూ కామెంట్స్ చేశారు.

కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడా.. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలం వ్యవసాయం చేయను.

Advertisement

Next Story

Most Viewed