- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శానిటేషన్ సిబ్బందితో ‘కేటీఆర్’ భోజనం..
దిశ, న్యూస్ బ్యూరో :
నగరంలోని సంజీవయ్య పార్కు ఎదురుగా ఉన్నడీఆర్ఎఫ్ శిక్షణా కేంద్రంలో బుధవారం శానిటేషన్, డీఆర్ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. సామాజిక దూరం పాటిస్తూ ఈ భోజన ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్ సమయంలో వైద్యులు, పోలీస్‌లతో సమానంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించిన కేటీఆర్.. కార్మికులను పలకరించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా నియంత్రణలో విశిష్ట సేవలు అందిస్తోన్న శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ సిబ్బందికి కూడా ప్రభుత్వం పూర్తి జీతంతో పాటు ప్రోత్సహకాలను ఇస్తోందని’ గుర్తుచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ చుట్టుపక్కల వారికి వివరించాలని కోరారు.
వర్షాకాలం రాబోతున్నందున దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ విభాగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, డిప్యూటి మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, శానిటేషన్ అదనపు కమిషనర్ రాహుల్‌రాజ్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Sanjeevaiah park, Minister KTR, Sanitation, DRF workers, training centre