- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురపోరుకు ‘రెడీ’.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మినీ పురపోరుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేసి 30న ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ఖరారు చేసినట్లు ప్రగతిభవన్వర్గాలు చెప్పుతున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ఇప్పటికే ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
ఆదివారం సాయంత్రం వరంగల్జిల్లాల ఎమ్మెల్యేలకు దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చినట్లు టాక్. సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరిగే జిల్లాలకు వెళ్లాలని సీఎం సూచించారని తెలుస్తోంది.
ఇప్పటికే పురపాలికల ఎన్నికల కోసం రిజర్వేషన్ల అంశం, వార్డుల విభజన, ఓటర్ల జాబితా, పోలింగ్కేంద్రాల జాబితాపై ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చింది. వార్డుల విభజనను పూర్తి చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు త్వరలో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు 2021 మార్చి 14తో ముగియనుండగా, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో తీరనుంది.
గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా హోదా పెరిగిన నకిరేకల్ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)లకు గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం పూర్తి అయింది. మున్సిపాలిటీల్లో చేరిపోయాయి. వీటికి ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేసేందుకు సీఎం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.