- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో: వార్డు, గ్రామ, మండల కమిటీలు దాదాపు పూర్తయ్యాయి. ఇక జిల్లా కమిటీలపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది. ఈ నెల చివరి వరకు జిల్లా, రాష్ట్ర కమిటీలను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లా అధ్యక్ష పదవి ఆశించే వారి సంఖ్య ఎక్కువైంది. అందులో పార్టీ కోసం చురుగ్గా, కీలకంగా వ్యవహరించేవారు, ఇప్పటికే జిల్లా కమిటీలో పనిచేస్తున్నవారి వివరాలను పార్టీ అధిష్టానం సేకరించింది. ఒక్కో జిల్లా నుంచి ముగ్గురి వివరాలను ప్రస్తుతం ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న వారి నుంచి బయోడేటాలను తీసుకుంది. వారం రోజుల్లో జిల్లా అధ్యక్షుల పేర్లను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం తొమ్మిది జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించలేదు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులకే ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించింది. కొన్ని జిల్లాలకు ఆ జిల్లాకు చెందిన మంత్రికే ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. అయితే పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నెల 2 నుంచి వార్డు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ, సోషల్ మీడియా కమిటీలను నియమించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా ఇప్పటికే వార్డు, గ్రామ, మండల, మున్సిపాలిటీ కమిటీలను దాదాపు పూర్తి చేసింది. ఈ నెలాఖరులోగా జిల్లా, రాష్ట్ర కమిటీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. పార్టీ పదవులు ఆశించే వారి నుంచి బయోడేటాలను సేకరించింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా చేరారు. పదవులను ఆశించి గతంలో కీలక పదవులు అనుభవించిన నేతలు సైతం గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకు తోడు పార్టీలో చేరిన వారు సైతం కమిటీల్లో చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తింపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వీరికి తోడు ప్రస్తుతం జిల్లా కమిటీల్లో ఉంటూ పార్టీ కోసం కృషి చేస్తున్న నేతలు సైతం మరోమారు పదవికోసం పాకులాడుతున్నారు. పదవులు కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో అధిష్టానం చిన్న జిల్లా అయితే ముగ్గురు… పెద్ద జిల్లా అయితే నలుగురి వివరాలను అందజేయాలని ప్రస్తుతం ఉన్న పార్టీ ఇన్ చార్జులను ఆదేశించడంతో సంబంధిత నేతల వివరాలను అందజేశారు. వారి వివరాలను పార్టీ పరిశీలిస్తోంది.
ఏ జిల్లాల్లో ఏ కులం బలంగా ఉంది… ఎవరూ ఓటర్లను ప్రభావితం చేయగలరు… రాబోయే ఎన్నికల్లో గెలిపించే సత్తా ఎవరికి ఉంది… జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి కలిసి వస్తుందా? లేదా? అనే వివరాలను పార్టీ అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. గతంలో పార్టీలో పనిచేసిన వారు ఏ విధమైన పనితీరును ప్రదర్శించారనే వివరాలను అధిష్టానం సేకరించింది. దీనికి తోడు సంబంధిత జిల్లాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల అభిప్రాయాన్ని సైతం తీసుకుంటుంది. వారి అభిప్రాయంతో పాటు కేసీఆర్ బయోడేటాలను పరిశీలించి వివాద రహితుడిగా, అందరిని కలుపుకొని పోయేవ్యక్తితో పాటు సంబంధిత సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే వ్యక్తినే జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతలు ముమ్మరప్రయత్నాలు చేపట్టారు.
- Tags
- distriicts
- KCR