సీఎం కేసీఆర్ మిత్రుడు.. సాంబయ్య ఆరోగ్యం విషమం

by vinod kumar |
Professor Sambayya
X

దిశ, కాళోజీ జంక్షన్: ముఖ్యమంత్రి కేసీఆర్ మిత్రుడు, తెలంగాణ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పసుల సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల కొవిడ్ బారినపడిన ఆయన వరంగల్ జిల్లా హన్మకొండ మాక్స్ కేర్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం వెంటి లేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో ఎంత ప్రయత్నించినా.. ఏ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ బెడ్‌లు దొరకడం లేవు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు చొరవ తీసుకుని మెరుగైన వైద్యం అందించి ప్రొఫెసర్ సాంబయ్యను కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story