- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిషా, కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ డ్రా
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21లో భాగంగా గురువారం రాత్రి ఫర్టోడా స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్, ఒడిషా ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. టాస్ గెల్చిన ఒడిషా క్లబ్ కుడి నుంచి ఎడమకు ఆడటానికి నిర్ణయించుకుంది. తొలి అర్దభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ గోల్ రావడం కష్టంగా మారింది. 45వ నిమిషంలో ఒడిషా ఆటగాడు డియాగో మారికో గోల్ చేసి ఆధిక్యాన్ని అందించాడు. ఇక రెండో అర్దభాగంలో ఇరు జట్లు దూకుడు ప్రదర్శించాయి. 52వ నిమిషంలో గారీ హూపర్ ఇచ్చిన పాస్‌ను జోర్డాన్ ముర్రే గోల్‌గా మలిచాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. 68వ నిమిషంలో గారీ హూపర్ గోల్ చేసి కేరళ బ్లాస్టర్స్ ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. 74వ నిమిషంలో ఒడిషా ఆటగాడు డియాగో మారికో మరో గోల్ చేయడంతో ఇరు జట్లు స్కోర్లు 2-2గా సమం అయ్యాయి. ఆ తర్వాత మరో గోల్ లభించక పోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. సాహల్ అబ్దుల్ సమద్‌కు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, డియాగో మారికోకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.