సిరిసిల్లలో 15మంది విద్యార్థులకు కరోనా..

by Sridhar Babu |
Corona virus
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలు తెరిచేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తీరా పాఠశాలలు ఓపెన్ అయ్యాక కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు విద్యార్థులు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు.

ఇప్పటికే మంచిర్యాల, ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లాల్లోని పాఠశాల విద్యార్థులకు కరోనా సోకగా, తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావు పేట కస్తూర్భా స్కూల్లో కొవిడ్ కలకలం సృష్టించింది.15 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. వేములవాడ శివరాత్రి జాతరకు వెళ్లొచ్చిన విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed