కత్రినా కైఫ్ కాళ్లు మొక్కిన హీరో

by  |   ( Updated:2020-03-05 02:02:41.0  )
కత్రినా కైఫ్ కాళ్లు మొక్కిన హీరో
X

హీరో కార్తీక్ ఆర్యన్ .. హీరోయిన్ కత్రినా కైఫ్ కాళ్లు మొక్కాడు. బుధవారం జరిగిన ఐఫా అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కత్రినా కైఫ్, కార్తీక్ ఆర్యన్ హాజరుకావాల్సి ఉంది. కానీ… కార్తీక్ లేట్‌గా రావడంతో… ఈవెంట్‌ కూడా లేట్‌గానే స్టార్ట్ అయింది. దీంతో కత్రినా చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. దీంతో మీడియాతో మాట్లాడే ముందు కార్తీక్ ఆలస్యంగా వచ్చినందుకు సారీ చెప్తాడట అని తెలిపింది కత్రినా. దీంతో కార్తీక ఆర్యన్.. కత్రినా కాళ్లు మొక్కి మరీ క్షమాపణ చెప్పాడు. సూర్యవంశీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు లేట్‌గా వచ్చినందుకు రణ్ వీర్ సింగ్ అందరి కాళ్లు మొక్కాడు కదా.. ఇప్పుడు నీ కాళ్లు నేను మొక్కుతాను అంటూ కత్రినా పాదాలను పట్టుకుని సారీ కోరాడు. కార్తీక్ ఆర్యన్‌ ఈ ఈవెంట్‌లో చేతికి కట్టుతో కనిపించాడు. ‘లవ్ ఆజ్ కల్’ చిత్ర ప్రమోషన్స్‌ టైంలో రైట్ హ్యాండ్‌కు గాయం కాగా.. సర్జరీ చేయించుకున్నాడు కార్తీక్.

మరో వైపు అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న సూర్యవంశీ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవ్‌గన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు లేట్‌గా వచ్చిన రణ్‌వీర్ సింగ్… అందరి కాళ్లు మొక్కాడు. సిటీలో మెట్రో పనులు జరుగుతుండడంతో కొంచెం ఆలస్యమైందంటూ సారీ చెప్పాడు. సీనియర్ హీరోలనే వెయిట్ చేయించిన యంగ్ హీరోగా మిగిలిపోతావు అంటూ అక్షయ్ సెటైర్ వేసినా.. క్షమించేశాడు.

Tags: Karthik Aryan, Katrina Kaif, IIFA2020, Ranveer Singh, Suryavanshi

Advertisement

Next Story