ఆ రాసలీలల ఖరీదు రూ.5 కోట్లు?

by Anukaran |
Karnataka minister sex videos
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కర్ణాటక మంత్రి రాసలీలల కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల బృందం.. ఈ వీడియోలో చిక్కిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని తాజాగా విచారించారు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఆయన పలు కీలక విషయాలు బయటపెట్టినట్టు సమాచారం.

రాసలీలల వీడియో గురించి తనకు నాలుగు నెలల క్రితమే తెలుసని మాజీ మంత్రి సిట్ అధికారులకు షాక్ ఇచ్చారు. కొందరు ఆ వీడియోని తనకు చూపించి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ వీడియో గురించి తాను అంతగా పట్టించుకోలేదని, ఎందుకంటే దానిలో కనిపిస్తోంది నేను కాదని రమేశ్ జార్కిహొళి చెప్పినట్లు తెలిసింది. తనను రాజకీయంగా ఢీకొనలేక.. నా ఎదుగుదలను అడ్డుకోవడానికే కొందరు నకిలీ వీడియోలతో కుట్రలు చేశారని సిట్‌కు వివరించినట్లు సమాచారం. రమేశ్ జార్కిహొళిని బెంగళూరులోని ఆయన నివాసంలో సుమారు రెండు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed