నిధుల వరద పారుతోంది: గంగుల కమలాకర్

by Sridhar Babu |
నిధుల వరద పారుతోంది: గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్: రానున్న కాలంలో హైదరబాద్ తరువాతి స్థానం కరీంనగర్ నగరానికే దక్కాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీంనగర్ లోని 30వ డివిజన్ లో నూతన పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… నగరాన్ని అన్నింటా అభివృద్ధి చేసేందుకు నిధుల వరద పారుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నగరాన్ని సుందరీకరణ చేయడంతో పాటు ప్రజలకు మౌళిక వసతులు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నామన్నారు. ఇప్పటికే నగర వాసుల కోసం 24 గంటల పాటు నీరందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే వాటర్ ట్యాంకుల ద్వారా ప్రయోగాత్మకంగా నీటిని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. లాక్ డౌన్ తరువాత రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిరంతర నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి కమలాకర్ తెలిపారు. ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు శుద్ధ జలాన్ని అందించాలన్న సంకల్పంతో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన అర్భన్ మిషన్ భగీరథ పథకం ద్వారా వీలైనంత త్వరగా తాగు నీటిని అందిస్తామన్నారు. ఓ వైపున రహదారులు, మరో వైపున మౌళిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు. గత 50 ఏళ్లలో ఏనాడు చేపట్టని అభివృద్దిని తెలంగాణ ప్రభుత్వం వల్ల ఒకేసారి చేపడుతున్నామని అన్నారు. రానున్న రోజుల్లో కరీంనగర్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్న లక్ష్యంతోనే వివిధ అభివృద్ది పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపా రాణి -హరిశంకర్, కార్పొరేటర్, నేతికుంట యాదయ్య కార్పోరేట్లర్లు, కమిషనర్ క్రాంతి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed