హర్షం వ్యక్తం చేసిన మంత్రి గంగుల

by Shyam |
Minister Gangula kamalakar
X

దిశ, వెబ్‌డెస్క్: స్వచ్ఛ సర్వేక్షన్‌లో ‘బెస్ట్ సిటిజెన్ లెడ్ ఇన్నోవేటివ్ 2020’ అవార్డు కరీంనగర్ నగరానికి దక్కడం సంతోషంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగర మేయర్ సునీల్ రావు, కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పరిపాలన, ప్రజలకు అందిస్తున్న సేవలు, శానిటేషన్, పౌర సేవలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే అవార్డులలో కరీంనగర్‌‌కు స్థానం దక్కడం మనందరం గర్వించదగ్గ విషయమన్నారు. గడిచిన నాలుగైదు ఏళ్ల నుంచి కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల మార్గదర్శనంతో నిర్ణయాలను అమలు పరచడం వల్లే ఈ అవార్డు లభించిందన్నారు.

Advertisement

Next Story