స్టార్లను చేసేది ప్రేక్షకులే : కరీనా కపూర్

by Anukaran |
స్టార్లను చేసేది ప్రేక్షకులే : కరీనా కపూర్
X

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య.. బాలీవుడ్‌లోని నెపోటిజం, ఆధిపత్య ధోరణులను బయటి ప్రపంచానికి తెలియజేసింది. పలువురు తారలు ఈ విషయాలపై తమ గళాన్ని వినిపిస్తుండగా.. మరోవైపు మాటల యుద్ధంతో పాటు చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. టాలెంట్ ఉంటే చాలు.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు మాత్రం టాలెంట్‌తో సంబంధం లేకుండా, నెపోటిజం వల్లే అవకాశాలు చేజిక్కించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా కపూర్ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన కరీనా కపూర్.. తాజా ఇంటర్వ్యూలో నెపోటిజంపై స్పందించింది.

‘ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా.. అటాకింగ్ మూడ్‌లో ఉంటున్నాం. బ్యాక్‌గ్రౌండ్ వల్ల పరిశ్రమలోకి వచ్చినవారి పట్ల చాలా నెగెటివ్ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అది సరి కాదు.. లోతుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్స్‌కు వారసులుగా ఎంట్రీ ఇచ్చినవారు ఆ తర్వాత స్టార్స్‌గా ఎదగలేకపోయారు. చాలా కష్టపడి పనిచేస్తూ ముందుకు పోవాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. ఇండస్ట్రీలో నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ నా స్ట్రగుల్ 10 రూపాయలు జేబులో పెట్టుకొని ట్రైన్ ఎక్కి వచ్చివారిలా ఉండదు. మమ్మల్ని స్టార్లను చేసింది ప్రేక్షకులే. ఇంకెవరూ కాదు. అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావుల‌కు ఇండస్ట్రీతో అసలు సంబంధం లేదు. వారంతా కూడా బయటి నుంచి వచ్చిన వారే. కానీ వాళ్లందరినీ ప్రేక్షకులు సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు ఆ నటులు కూడా ఎంతో కష్టపడి సక్సెస్ ఫుల్ యాక్టర్స్ అనిపించుకున్నారు. అలియా భట్, కరీనా కపూర్ అనే కాదు.. ఇంకెవరైనా కష్టపడితేనే ప్రజలు ఎంకరేజ్ చేస్తారు. మేం సరిగ్గా నటించకపోతే వారే రిజెక్ట్ చేస్తారు’ అని కరీనా పేర్కొంది.

Advertisement

Next Story